Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో చిన్న పత్రికల మాదిరిగానే అన్ని దిన, వార, పక్ష, మాస పత్రికల(మ్యాగజైన్లు)కూ ప్రకటనలు జారీచేయాలని తెలంగాణ వర్కిం గ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యద్శి బి.బసవపున్నయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు చిన్న పత్రిక లకు ప్రతినెలా ప్రకటనలు ఇచ్చే విధానాన్ని పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది పత్రికల మనుగడకు ప్రధానంగా ఆయా పత్రికలు, మ్యాగ జెన్లల్లో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుం దని చెప్పారు. సమాజం కోసం పత్రికలు పనిచేస్తాయనీ, అన్ని పత్రికలకూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రకటనలు జారీ చేయాలని కోరారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల ఉనికిని ప్రశ్నార్థకం చేసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల పునరుద్ధరణ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. కాగా జర్నలిస్టులకు జారీచేసిన హెల్త్‌కార్డులను రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెల్లుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత 30 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇండ్ల స్థలాల సమస్యను సీఎం కేసీఆర్ వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్ఏజే హర్షం
తెలంగాణ రాష్ట్రంలో చిన్న పత్రికల మనుగడకు తోడ్పడే రీతిలో ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్(ఎన్ఏజే) హర్షం వ్యక్తం చేసింది. ఇక ముందు కూడా ఇదే వైఖరితో చిన్న పత్రికల మనుగడను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దులో భాగంగా జర్నలిస్టుల కోసం ఉన్న రెండు చట్టాలను రద్దు చేయడం, జర్నలిస్టుల ఉద్యోగ భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యా తీసుకోకపోవడం, మీడియా రంగం వత్తి విలువల పరిరక్షణతో కొనసాగేందుకు వీలైన పరిస్థితులు కల్పించడంలో విఫలం చెందుతున్న ప్రస్తుత తరుణంలో చిన్న పత్రికలకు తోడ్పాటు అందించే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం అభినందనీయమని ఎన్ఏజే సెక్రటరీ జనరల్ కె. కొండయ్య, కోశాధికారి ఎ.అమరయ్య, తెలుగు రాష్ట్రాల కన్వీనర్లు ఏ. ఆంజనేయులు, సత్యనారాయణ, అశోక్ తెలిపారు.