Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపకల్పన
- యూకేలోని రెండు వర్సిటీలతో ఓయూ, కేయూ మధ్య ప్రాజెక్టు
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడంతోపాటు ఉద్యోగ నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యమని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. ఉన్నత విద్యామండలి, బ్రిటీష్ కౌన్సిల్, యూకేలోని రెండు విశ్వవిద్యాలయాలు (బంగర్, అబరిస్ట్ విత్ యూనివర్సిటీలు), రాష్ట్రంలోని ఉస్మా నియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు సమిష్టిగా కరికులం అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టాయని తెలిపారు. ఏటా డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతు న్నదని పేర్కొన్నారు. బీకాంలోనే ఏటా లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడమే ఉద్దేశమని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నమూనా పాఠ్యప్రణాళికను రూపొం దించి కళాశాలలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా గురువారం వర్చువల్ పద్ధతిలో యూకే బంగర్, అబరిస్ట్ విత్ విశ్వవిద్యాలయాలు, ఓయూ, కేయూ వీసీలు, సీనియర్ ప్రొఫెసర్లతో సమా వేశం జరిగింది. ఈ ప్రాజెక్టును వచ్చేఏడాది మే వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని లింబాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థు లకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొ న్నారు. ప్రపంచస్థాయి పోటీకి తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూవీసీ డి.రవీందర్, కేయూవీసీ టి.రమేష్, ప్రాజెక్టు డైరెక్టర్ ఉషాకిరణ్, ప్రొఫెసర్లు అప్పారావు, స్టీవెన్సన్, రాజిరెడ్డి, వరలక్ష్మి, గోపికృష్ణ, విజయబాబు, యాదగిరిరావు, యూకే నుంచి ఆంకా, ఫ్లోరినా,ఎస్ జాక్సన్, హిమజ పాల్గొన్నారు.