Authorization
Sun April 13, 2025 01:51:33 pm
నవతెలంగాణ-అంబర్పేట
అనాథలకు అండగా ఉంటామని అన్నా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజగోపాల నాయుడు అన్నారు. అన్నా ఫౌండేషన్ తృతీయ వార్షికోత్సవం, కొడవలి సత్యనారాయణ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజగోపాల నాయుడు మాట్లాడుతూ తన తండ్రి కొడవలి సత్యనారాయణ ఆశయాల సాధన కోసం అన్నా ఫౌండేషన్ నెలకొల్పి అనాథలకు అండగా నిలుస్తున్నట్టు చెప్పారు. గత మూడేండ్లుగా విద్యార్థులకు ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషాన్ని మిగిల్చిందని చెప్పారు. అనంతరం అనాథాశ్రమలోని చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు అందజేశారు. కార్యక్రమంలో అన్నా ఫౌండేషన్ సభ్యులు కొండ లోకేష్శెట్టి, కొడవలి కార్తికేయ నాయుడు, చైతన్య నాయుడు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.