Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
సీసీ రోడ్డు నిర్మాణ పనులతో పగిలిపోయిన తాగునీటి పైపులైన్లకు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ బి.వెంకటరెడ్డి జల మండలి అధికారులను కోరారు. బాగ్ అంబర్పేట డివిజన్ తూరబ్నగర్ ఇరానీ గల్లీలో తాగునీటి పైపులైన్ పగిలి ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి దృష్టికి రావడంతో గురువారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్యను పరిశీలించారు. పగిలిపోయిన పైపులైన్ స్ధానంలో నూతన నిర్మాణం చేపట్టి వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని జల మండలి మేనేజర్ మాజీద్కు విన్నవించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో బాగ్ అంబర్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు చుక్కా జగన్, ప్రధాన కార్యదర్శి జమ్మి చెట్టు బాలరాజు, రాంరెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.