Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్ డివిజన్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు బల్ల శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ సునీతను ఉద్దేశించి హెచ్చరించారు. గురువారం స్థానిక సత్యనగర్ కమిటీ హాల్లో టీఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు బల్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. బీజేపీ డివిజన్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్ ప్రతి పనిలో అవాంతరాలు సృష్టిస్తూ కనీసం ప్రజలకు అందుబాటులో ఉండకుండా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న కనీసం నియోజకవర్గానికి నయాపైసా నిధులు కేటాయించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్లో అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే డివిజన్ అభివృద్ధికి తమతో కలిసి పని చేయాలని కోరారు. సమావేశంలో మల్లికార్జున్ రెడ్డి, బిక్షపతి, ఆకారం శ్రీనివాస్, ఖలీల్, హరీష్, అబ్బు, రవి యాదవ్, గురూదీప్ సింగ్, ప్రేమ లత, అనురాధ, జల్ల మాధవి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.