Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
అభివృద్ధి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం బాగ్ అంబర్పేట డివిజన్ పరిధిలోని సీజన్ హాస్పిటల్ వద్ద జరుగుతున్న డ్రయినేజీ నిర్మాణ పనులను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వైభవ్ నగర్ బస్తీ వాసులు డ్రయినేజీ, తాగునీటి పైప్లైన్ ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. వెంటనే సానుకూలంగా స్పందించిన ఆయన తాగునీటి లైన్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ఇన్స్పెక్టర్ రవి, డా. మంగారెడ్డి, డా. దేవేందర్, డా. శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మోర శ్రీరాములు ముదిరాజ్, సతీష్, యాదాద్రి, గణేష్, జ్ఞానేశ్వర్, రామకృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.