Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-ముషీరాబాద్
జనవరి చివరినాటికి కోకాపేటలో ఐదెకరాల్లో గౌడ భవనానికి శంకుస్థాపన చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని మరింత ఆధునికరించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మెన్ బాలగోని బాలరాజ్ గౌడ్, వర్కింగ్ చైర్మెన్ ఎలికట్టె విజరు కుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, వైస్ చైర్మెన్ గడ్డమీది విజరు కుమార్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట నరసయ్య గౌడ్, నాయకులు కొత్త నవీన్, కేశమౌని శ్రీనివాస్, చింతపల్లి శ్రీనివాస్, అంబటి బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.