Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన రైతన్న డైరీ 2022ను ఒక సామాన్య రైతైన నాని చంద్రయ్య గురువారం హైదరాబాద్లోని ఆ సంఘం కార్యాలయంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ అకాల యజమానులను వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి, మిర్చి, మొక్కజొన్న, వరి, మామిడి తోటల రైతులు, కోళ్ళ ఫారాలను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రైతు బంధు అందని రైతులు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ధరణి ఇబ్బందులు రైతులను బాధిస్తున్నాయని పేర్కొన్నారు. కౌలు, పోడు రైతులకు ఈ పథకం అమలు కాకపోవటంతో ప్రయివేటు అప్పులకు పోతున్నారని తెలిపారు. వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి విఎస్ ప్రసాద్ శాస్త్రీ, కార్యవర్గ సభ్యులు పి రామకృష్ణారెడ్డి, కిరణ్, హైకోర్టు న్యాయవాది గోకుల్, డాక్టర్ విజరుకుమార్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.