Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్‌పార్టీ డిజిటల్ మెంబర్షిప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గురువారం గాంధీభవన్‌లో పార్టీ అనుబంధ సంఘాల చైర్మెన్లు, పార్టీ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, సంభాని చంద్రశేఖర్, సభ్వత్యం సమన్వయకర్త హర్కర వేణుగోపాల్‌తోపాటు ముఖ్యనాయకులతో రేవంత్ సమావేశమయ్యారు. సభ్యత్వం నమోదు ప్రక్రియపై చర్చించారు. సభ్యత్వాన్ని చేర్పించడంతో ఎదురవుతున్న సమస్యలను రేవంత్ దృష్టి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగల్ సమస్య తలెత్తుతుందనీ, కరోనా పరిస్థితులు ప్రతికూలంగా మారాయనీ, దీంతో కొంత ఆలస్యమవుతుందని రేవంత్ దృష్టికి తెచ్చారు. సభ్యత్వం గడువు తేదీని మార్చి వరకు పొడిగించేందుకు అధిష్టానాన్ని కోరుతానని రేవంత్ చెప్పారు. ఇప్పటికీ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం ఎనిమితి లక్షల డిజిటల్ మెంబర్‌షీప్ నమోదైందన్నారు. 30 లక్షల సభ్యత్వం లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 1.4 లక్షల సభ్యత్వం చేయించి ముందు వరసలో నిలిచిందని రేవంత్ అభినందించారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యల్పంగా 15వేల మాత్రమే చేయించారని తెలిపారు. అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేసిన నాయకులకు రాహుల్‌గాంధీతో సన్మానం జరిపిస్తామని రేవంత్ తెలిపారు.