Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రుల్లో సిబ్బందిని పెంచాలి : తెలంగాణ పౌర స్పందన వేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా సెకెండ్ వేవ్ సందర్భంగా తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బస్తీ దవాఖానాల నుంచి జనరల్ ఆస్పత్రుల వరకు అన్ని స్థాయిల్లో వెంటనే సిబ్బందిని పెంచాలని కోరింది. ఈ మేరకు గురువారం ఆ వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎం.రాధేశ్యాం ఒక ప్రకటన విడుదల చేశారు. 18 ఏండ్లలోపు వారికి వ్యాక్సినేషన్ మందకొడిగా జరుగుతున్నదని తెలిపారు. రెండో డోసు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం పూర్తి కాలేదని చెప్పారు. వేదిక సభ్యులు రాష్ట్రంలో సర్వే నిర్వహించగా ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు స్థూలంగా బాగానే ఉన్నప్పటికీ కొన్ని లోపాలు ఉన్నాయని వెల్లడించారు. బస్తీ దవాఖానాల నుంచి జనరల్ ఆస్పత్రుల వరకు సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా ఉండటం లేదనీ, కొన్ని చోట్ల మందుల కొరత ఉందని ప్రకటించారు. తెలంగాణ డయాగస్టిక్ సేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయడ్డారు.