Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో ఒక్క రోజే 2,707 మందికి కరోనా
- జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో థర్డ్‌వేవ్ మొదలయ్యాక తొలిసారిగా 33జిల్లాల్లో కేసులు పెరి గాయి. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి కొన్ని జిల్లాల్లో పెరుగు దల కనిపిస్తే, మరి కొన్ని జిల్లాల్లో తగ్గుదల కనిపించేది. ఇంకొన్ని జిల్లాల్లో నిలకడగా ఉండేవి. అయితే బుధవారంతో పోలిస్తే గురువారం నాటికి రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో కేసులు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 84,280 మందికి టెస్టులు చేయగా 2,707 మందికి పాజిటివ్ వచ్చినట్టు మీడియా బులెటిన్
వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 20,462కు చేరింది. ఇద్దరు మరణించారు. 10,026 టెస్టు రిపోర్టులు రావాల్సి ఉన్నవి. పాజిటివ్ రేటు 3.21గా నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1,328 మందికి పాజిటివ్ రాగా ఆ తర్వాత మేడ్చల్ - మల్కాజిగిరిలో 248, రంగారెడ్డిలో 202 మంది వైరస్ బారిన పడ్డారు.