Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగు మారిన కల్లాల్లోని పంట
నవతెలంగాణ- విలేకరులు
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లక్ష్మిపురంలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట తడిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలంలో మిర్చి పంటలో నీరు నిలిచింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట తడిసి రంగు మారింది. ఇల్లందులో మొక్కజొన్న పైరు నేలకూలింది. పొగాకు వాడిపోయి దెబ్బతింది. దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) నాయకులు పరిశీలించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జల్లాలో 1.50 మి||మీ||ల వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని సీసీ కుంట, అడ్డాకుల్, మూసాపేట, భూత్పూరు, జడ్చర్ల, మిడ్జిల్, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెంట్లవెళ్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది.కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో వేరుశనగ, జొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. పెంట్లవెళ్లి మండలంలోని యంగంపల్లి తండాలో మొక్కజొన్న పైరు నేలవాలింది. మండల కేంద్రంలో వర్షపు నీరంతా సీసీ రోడ్లపై నిలిచి ఇండ్లలోకి చేరింది.