Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయి సన్నిధి ప్రాపర్టీస్ ప్రవేట్ లిమిటెడ్ చైర్మెన్
- ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేత
హైదరాబాద్ : తెలుగు సాంప్రదాయాలకు సంస్కృతికి ప్రతి రూపం సంక్రాంతి వేడుకలని సాయి సన్నిధి ప్రాపర్టీస్ ప్రవేట్ లిమిటెడ్ చైర్మెన్ శ్రీనివాస్, ఎండీ సంధ్య అన్నారు. ఈ మేరకు గురువారం నగరంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా వన్ గ్రామ్ గోల్డ్ 2వ బహుమతిగా గ్రాండ్ మిక్సర్, 3వ బహుమతిగా వెయ్యి రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరానికి మన సంస్కృతికి సాంప్రదాయాలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సన్నిధి ప్రాపర్టీస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.