Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్‌బ్యూరో
వస్త్రాలపై, సంబంధిత పరిశ్రమలపై జీరో జీఎస్టీ ఉండేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కేంద్రంపై వత్తిడి తెచ్చినందుకు తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో మంతిని కలిసి వారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని అభినందించారు. టెక్స్టైల్స్ పరిశ్రమపై 12శాతానికి జీఎస్టీని పెంచాలనే కేంద్ర ప్రతిపాదనను తిప్పికొట్టి దాన్ని 5శాతానికే పరిమితం చేసినందుకు వారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో చొరవచూపి కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు లేఖ రాసిన కేటీఆర్‌ను వారు అభినందించారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్స్ అధ్యక్షులు అమ్మనబోలు ప్రకాశ్, ఉపాధ్యక్షులు సిహెచ్ సంతోష్, గండూరి శంకర్ తదితరులున్నారు.