Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పంటల పరిశీలన
నవతెలంగాణ-కొణిజర్ల
ఖమ్మం జిల్లాలో బుధవారం, గురువారం కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను గురువారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ సీజన్లో తీవ్రంగా నష్టపోయి ఉన్న రైతులపై అకాల వర్షం పిడుగు లాగా పడిందన్నారు. ఖరిఫ్ సీజన్లో అధిక వర్షాల వల్ల పెసర, పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులకు ఆర్థికంగా నష్టం జరిగిందన్నారు. తర్వాత కాలంలో మిర్చి పంట, మామిడి తోటలకు తామర వైరస్ ప్రభావం వల్ల నష్టం జరిగిందన్నారు. వైరస్, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, వడ్లమూడి నాగేశ్వరరావు, మండల నాయకులు దొడ్డపనేని కృష్ణార్జున్రావు, మిద్దె రామారావు, గాదె వెంకటరెడ్డి, దుగ్గినన్ని నాగేశ్వరరావు పాల్గొన్నారు.