Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిడ్ల ద్వారా 24.6 శాతం వాటా స్వాధీనం
తొమ్మిది రాష్ట్రాలకు సరఫరా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన నగర గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్ట్‌పై మెఘా సంస్థ దృష్టిసారించింది. పెట్రోలియం నాచురల్ గ్యాస్ నియంత్రణా మండలి(పీఎన్జీఆర్బీ) నిర్వహించిన 11వ రౌండ్ బిడ్డింగ్‌లో అత్యధిక సీజీడీ ప్రాజెక్ట్‌లను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) దక్కించుకోనుంది. ఇటీవల పీఎన్జీఆర్బీ 65 బౌగోళిక ప్రాంతాలకు బిడ్లను నిర్వహించగా 61 చోట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో మేఘా సంస్థ 15, అదానీ 13, ఐఒసీఎల్ తొమ్మిది దక్కించుకోగా మిగిలిన వాటిని ఇతర సంస్థలు దక్కించుకున్నాయి. మొత్తం బౌగోళిక ప్రాంతాల్లో 24 .6 శాతాన్ని చేజిక్కించుకుని మెగా సంస్థ అగ్రభాగాన నిలిచింది. ఈమేరకు పీఎన్జీఆర్ఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ సంస్థ సాధించిన ప్రాంతాలు కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ , తెలంగాణాలో ఉండటం గమనార్హం. కర్నాటకలో చిక్బల్లాపూర్, యాద్గిర్, తమిళనాడులో తిరువాన్మలై, విల్లుపురం, కళ్లకుర్చీ , అరియాలూర్, పెరంబలూర్, పుదుకోట్టై, శివగంగ, తంజావూరు, దుండిగల్, కరూర్ జిల్లాలో సీజీడీ ప్రాజెక్టులను మేఘా దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌లో అగరమాళ్వా , నీముచ్, మండసూర్ , బేతుల్, ఛింద్వారా, సెయోనీ , బాలాఘాట్, దామోహ్, జబల్పూర్, కట్ని , మాండలా , ఉమారియా, దిండోరి, హౌషంగాబాద్, నర్సింగపూర్, సాగర్, విదిష, రాజస్థాన్‌లో జాల్వార్, మహారాష్ట్రలో చంద్రాపూర్, వార్ధా, ఒడిశాలో రాయగడ, కలహంది, బోలంగిర్, నౌపాడ, పంజాబ్‌లో తరన్‌తరన్ , తెలంగాణాలో జోగులాంబ-గద్వాల్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి ఉండగా, ఉత్తరప్రదేశ్ అంరోహ, సాంభాల్ , కసగంజ్ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పైపులైన్లు, గ్యాస్స్టేషన్లను మెఘా సంస్థ నిర్మించి స్థానికులకు గ్యాస్ సరఫరా చేయనుంది.