Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజామోద, ప్రజోపయోగ, రైతు అనుకూల పథకాలతో నిజమైన సంక్రాంతి వచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రమేర్పడిన నాటికి వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఉండేదనీ, రైతంటే పిల్లను ఇవ్వలేని దుస్థితి ఉండేదని తెలిపారు.పంట పెట్టుబడిగా రైతు బంధుని ప్రతి ఏటా ఎకరాకు రూ.10వేల చొప్పున ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియా డారు.కోతల్లేకుండా 24గంటల కరెంటును రాష్ట్రంలో ఇస్తున్నామని తెలిపా రు.రైతులకు ప్రభుత్వమే బీమా చేస్తూ,చివరకు పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు.65లక్షల మంది రైతులకు రూ.50 వేలకోట్ల రైతు బంధు,70వేల మంది రైతు కుటుంబాలకు రూ.3,500కోట్ల బీమా క్లెయిమ్లు ఇస్తున్నామని తెలిపారు.సీఎం కేసీఆర్ హయాంలోనే రైతాంగానికి అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందని తెలిపారు.