Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్మికులను మినహాయించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఓవైపు కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు నుంచి మున్సిపల్ కార్మికులను మినహాయించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖమర్అలీ, పాలడుగు భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణకు వారు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల నుంచి బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకునే విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తూ జీవో నెంబర్ ఒకటిని విడుదల చేసి మరోవైపు బయోమెట్రిక్ ఏమిటని ప్రశ్నించారు. కరోనా కాలంలో కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేక అలవెన్స్ చెల్లించాలని కోరారు.