Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్యం కోసం డబ్బుల డిమాండ్
నవ తెలంగాణ-జోగిపేట
మద్యానికి బానిసైన కొడుకు డబ్బుల కోసం కన్న తండ్రినే గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని మన్సాన్పల్లిలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన చాకలి లక్ష్మయ్య(65) కొడుకు కిష్టయ్య మద్యానికి బానిసయ్యాడు. అందుకోసం డబ్బులు కావాలని తరచూ తండ్రితో గొడవ పడేవాడు. గురువారం రాత్రి కూడా కిష్టయ్య తండ్రిని డబ్బులు అడగ్గా లేవని చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మయ్యపై కొడుకు గొడ్డలితో దాడి చేయగా.. తల్లి భూమమ్మ అడ్డుకునేందుకు యత్నించింది. అయినా వినకుండా నరికి చంపేశాడు. భయంతో భూమమ్మ బయటకొచ్చి కేకలు వేసింది. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చి కిష్టయ్యను పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో జోగిపేట సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య భూమమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.