Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైతు ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలో జరిగింది. ఎస్ఐ సతీష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వెల్మకన్నె గ్రామానికి చెందిన బరిగెల ఎల్లయ్య(56) తన నాలుగెకరాల భూమిలో ప్రతి ఏడాదీ పత్తి సాగు చేస్తున్నాడు. కానీ దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీనికి తోడు కుమార్తె వివాహానికి రూ.6 లక్షల అప్పులు చేశాడు. అప్పులన్నీ తీర్చే దారిలేదు. దాంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రైతు భార్య రుక్కమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.