Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలాజీ నాయక్
నవతెలంగాణ-కంది
కోళ్ల పందేలు ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 13 కోళ్లు, రూ. 96 వేలు, 14 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి మండలంలోని ఫసల్వాది గ్రామ శివారు ఎంఎన్ఆర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఇటుక బట్టీల ప్రాంతంలో శుక్రవారం జరిగింది. డీఎస్పీ బాలాజీ నాయక్ మీడియాకు వివరాలు వెల్లడించారు.ఎంఎన్ఆర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఇటుక బట్టీల ప్రాంతంలో కొంత మంది వ్యక్తులు డబ్బులు పెట్టి కోళ్ల పందెం ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం అందింది. సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం, ఎస్ఐ సుభాష్, ఇంద్రకరణ్, ఎస్ఐ రాజేష్ నాయక్ సిబ్బందితో కలిసి శుక్రవారం ముకుమ్మడిగా దాడి చేశారు. 14 మంది పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. అలాగే, 13 పందెం కోళ్లను, 14 సెల్ఫోన్లను, రూ.96 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎక్కడైనా కోళ్ల పందెం కాస్తున్నట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.