Authorization
Sat April 12, 2025 12:30:59 am
- సైకాలిజిస్టుల మార్గనిర్దేశనం తీసుకోవాలి :మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మానసిక ఒత్తిడిలో ఉన్న వారు సరైన నిర్ణయం తీసుకోలేరని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. అలాంటి సమయంలో సైకాలజిస్టులను సంప్రదిస్తే సరైన మార్గనిర్దేశనం చేస్తారని సూచించారు. శక్రవారం హైదరాబాద్లో ఆయన తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ డైరీని, క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న ఒత్తిళ్లతో జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. సైకాలజిస్టుల సేవలు సమాజానికి అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు.మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.ఉచిత ఫోన్ కౌన్సిలింగ్ ద్వారా కరోనా బాధితులకు భరోసా ఇవ్వడం గొప్ప సామాజిక సేవా కార్యక్రమంటూ అసోసియేషన్ నాయకులను కొనియాడారు. సైకాలజిస్టులకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రాంచందర్ మాట్లాడుతూ,అసోసియేషన్ ఆవిర్భావం నుంచి నిరంతరం సహాయ,సహకారాలందించినందుకు బేవరేజెస్ కార్పొరే షన్ మాజీ చైర్మెన్ దేవి ప్రసాద్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.