Authorization
Fri April 11, 2025 07:52:39 pm
- జీఆర్ఎంబీ చైర్మెన్‌గా పోలవరం సీఈవో
- ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమే : నిపుణులు బి బసవపున్నయ్య
గోదావరినదీ యాజమాన్య బోర్డు (జీఆర్ ఎంబీ)పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. ఆబోర్డును రద్దుచేయా లనే డిమాండ్ ముందు కొస్తున్నది. లేకపోతే చైర్మెనైనామార్చాలనే విజ్ఞప్తులు వస్తు న్నాయి. జలవివాదాలపరిష్కారం పేరుతో రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్న
బీజేపీ ప్రభుత్వం, ఆ సమస్యలను తేల్చడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నది. కుట్ర రాజకీయాలను పూనుకుంటు న్నది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అమలుచేయక పోగా, కొత్త తగవులను సృష్టిస్తూ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేపనిలోఉంది. ఈవిషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఇందుకు జీఆర్ఎంబీ బోర్డు చైర్మెన్‌గా పోలవరం సీఈవోను నియమించడంలోని అంతర్యమే కేంద్రం వైఖరి తేటతెల్లమవుతున్నది. గతేడాది అక్టోబరు 14న విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి వివా దాలను పెంచింది. దీంతో కేంద్రం చిత్తశుద్ధిపై అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. రోగమొకటైతే మందు ఇంకొకటి ఇచ్చినట్టుగా ఉంది జలవివాదాల పరిష్కారంలో కేంద్రం కపట వైఖరి.
గోదావరి బేసిన్
గోదావరి బేసిన్ మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిషా పరిధిలో ఉంది. 1975లో బచా వత్ ట్రిబ్యునల్ తీర్పుప్రకారం ఈరాష్ట్రాలు నీళ్లను వాడు కోవచ్చు. మొత్తం 3000టీఎంసీలు అందుబాటులో ఉం టాయి. మహారాష్ట్ర 888.9 టీఎంసీలు, కర్నాటక19.9, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి)1172.78, ఛత్తీస్‌గఢ్ 525.26, ఒడిషా 292.96 టీఎంసీలు వాడుకునే హక్కు ఉంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి నదీపై భూపాలపట్నం వద్ద విద్యుత్ హైడల్ ప్రాజెక్టును నిర్మించారు. అక్కడి నుంచి 306.87 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఈ నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకోవాల్సి ఉంది. దాదాపు 1500 టీఎంసీలు వాడుకునే హక్కును బచావత్ ట్రిబ్యునల్ తీర్పు కల్పించింది. ఇందులో తెలంగాణ 970 టీఎంసీలు, ఏపీ 509.65 టీఎంసీలు వినియోగించుకోవాలి. తీర్పు వచ్చేనాటికి తెలంగాణ 380 టీఎంసీలు, ఏపీ 300టీఎంసీలు వాడుకునే అవకాశముంది. ఈ నీటిని గోదావరి డెల్టాకు ఉపయోగించుకుంటున్నది. అయితే అదనంగా నీళ్లను వాడుకుంటూ కొత్తగా ప్రాజెక్టు నిర్మించడం ఈ తగాదాను పెంచినట్టయింది.
ఏపీలో జిల్లాలు.. ఎకరాలు
తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు, పుష్కరం, ముసురు మల్లి, భూపతిపాలెం, వెంకటాపురం పంపింగ్, చాగల్నాడు పంపింగ్, తాండవ, సూరంపాలెం, సుబ్బారెడ్డిసాగర్ ప్రాజెక్టుల ద్వారా 4.13 లక్షల ఎకరాలు ఖాస్తు అవుతున్నది. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో తాడిపూడి రిజర్వాయర్, తాడిపూడి లిఫ్ట్, ఎర్రకాలువ, కొవ్వాడ కాలువ, తమ్మివేరు తదితర ప్రాజెక్టు ద్వారా 2.50లక్షల ఎకరాలు సాగుచేస్తు న్నారు. విశాఖపట్నం జిల్లాలో తాండవ రిజర్వాయర్, పెద్దేరు రిజర్వాయర్, ఏలేరు రిజర్వాయర్, రైవాడ తదితర పథ కాలతో 1.44 లక్షల ఎకరాలు, కృష్ణా జిల్లాలోని తారకరామ, కృష్ణవేణి ప్రాజెక్టు ద్వారా 53వేల ఎకరాలు సాగులోకి వచ్చిం ది. గోదావరి జలాలను అదనంగా వాడుకోవడానికి ఈ ప్రాజెక్టులను కట్టిన సంగతి తెలిసిందే. తద్వారా మొత్తం 8.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరుపారుతున్నది. ఇదిలావుండగా పట్టిసీమ ద్వారా మరో 120 టీఎంసీలు కృష్ణా బ్యారేజీకి మళ్లిస్తూ వాళ్ల అవసరానికి మించి వినియోగిస్తుండటం గమనార్హం.
తెలంగాణ వాడకం
తెలంగాణలో శ్రీరాంసాగర్‌తో సహా వాడుతున్నది తక్కు వే. పాత కేటాయింపులు 370 టీఎంసీలు కాగా, కొత్తగా కట్టిన కాళేశ్వరంతో 280 టీఎంసీలు, సీతారామసాగర్ 60 టీఎంసీలు, దేవాదుల ద్వారా 40 టీఎంసీలు, శ్రీరాంసాగర్ వరదకాలువ నుంచి 20టీఎంసీలు మొత్తం 770 టీఎంసీలు మాత్రమే వాడుతున్నారు. ఇంకా 200 టీఎంసీలు వాడుకునే అవకాశం, హక్కు ఉంది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీలు తరలించుకుపోతే 34 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు ఇవ్వాలని బచావత్ ట్రిబ్యునల్ తీర్పుచెప్పింది. అయితే ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ కృష్ణాబేసిన్‌లోకి వస్తాయి. ఏపీ గోదావరి జలాలను 120 టీఎంసీలు మార్పిడి చేయడం మూలానా 34 టీఎంసీల నీరు కృష్ణాజలాల కేటాయింపుల్లో ఎగువనున్న తెలంగాణకు ఇవ్వాల్సి ఉంటుంది.
గోదావరి నికర..మిగులు జలాలు..వాస్తవాలు
1975లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, గోదావరిపై కేంద్ర ప్రభుత్వం జీఆర్ఎంబీ వేయడం తెలంగాణ హక్కులను లాక్కోవడమే. పరోక్షంగా తెలంగాణకు రావాల్సిన నీటిని వినియోగించు కోకుండా అడ్డుకోవడమే అవుతుంది. ఈ నేపథ్యంలో ఏ వివాదం లేని గోదావరి జలాలపై జీఆర్ఎంబీని ఉపసంహ రించడం మంచిదనే అభిప్రాయాలు సాగునీటిరంగ నిపు ణుల నుంచి వస్తున్నది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత తమ వాటాలను పంచుకున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 3000 టీఎంసీలు పోగా మిగులు జలాలు ప్రతియేటా మరో 2000 నుంచి 2500 టీఎంసీల వరకు నికరంగా వస్తాయి.
కానీ, నిల్వ సౌకర్యం లేకపోవడంతో ఈ నీరంతా సముద్రంలో కలుస్తున్నది. గోదావరి మిగులు జలాలు వస్తున్నాయనీ, ఈ వరదలు పోయిన తర్వాత సంవత్సరం పొడగునా నికర జలాల నుంచి కేటాయించాలని ఇతర రాష్ట్రాలు కోరడం సమంజసం కాదు. సమర్థనీయం అంతకన్నా కాదు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాల నేపథ్యంలో వరదలు వస్తాయి. అప్పుడు ఏ రాష్ట్రం ఎన్ని టీఎంసీలల నీటినైనా వాడుకోవచ్చు. అప్పుడు ఏ సమస్యా ఉండదు. సెప్టెంబరు నుంచి జూన్ వరకు వరదలు రావు. అప్పుడు నికర జలాలు గోదావరిలో ప్రవహిస్తాయి. అందువల్ల నికర జలాల్లోని కేటాయింపుల నుంచి వాడుకోవడం సరికాదు. ఇది బచావత్ తీర్పు ఉల్లంఘనే అవుతుంది. ఈనేపథ్యంలో జీఆర్ఎంబీ బోర్డు రద్దుచేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది.