Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్తూపావిష్కరణలో జానారెడ్డి,రంగారెడ్డి, కోటిరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
యూటీఎఫ్ మాజీ నాయకులు లకృతినాయక్ సేవలు మరువలేవని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం రాగడపలో పానుగోతు లకృతినాయక్ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్తూపావిష్కరణలో వీరు వేర్వేరుగా పాల్గొని మాట్లాడారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో, యూటీఎఫ్ నాయకుడిగా విశిష్ట సేవలందించారన్నారు. ఆపదలో ఉన్న ఉపాధ్యాయులను ఆదుకోవడంలో తమ వంతు కృషి చేశారన్నారు. సంఘం బలోపేతం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. గిరిజన సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు..ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు వీర్లపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు నాగమణి, శ్రీనివాసాచారి, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్, రైౖతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రామచంద్రనాయక్, పెద్దవూర సర్పంచ్ నడి లింగయాదవ్, నాయకులు ధరావత్ ధన్‌సింగ్‌నాయక్, కలకొండ వెంకటేశ్వర్లు,బాబురావునాయక్, భిక్షానాయక్,మిట్టపల్లి శ్రీనివాస్, హైమద్‌అలీ, పలుగు తండా గ్రామస్తులు పాల్గొన్నారు.