Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-రామన్నపేట
విష్ణుధనుస్సు గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా కడదాక పేదల పక్షాన నిలిచిన కమ్యూనిస్టునాయకుడని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడలో సీపీఐ(ఎం) కార్యకర్త కడమంచి విష్ణుధనుస్సు భార్య ఉప్పలమ్మకు పార్టీ ఆధ్వర్యంలో మీటూ వీ స్వచ్ఛంద సంస్థ సహకారం నిర్మించి పక్కా ఇంటిని ఆయన ప్రారంభించి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ కల్లూరి నగేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విష్ణుదనస్సు తన చివరిదాక పేద ప్రజల పక్షాన నిలిచి పోరాడాడని, గుడిసెలో జీవిస్తున్న కుటుంబ పరిస్థితిని చూసి పార్టీ ఆధ్వర్యంలో లక్ష రూపాయలు ఖర్చు చేసి మీటూ వీ అనే స్వచ్చంద సంస్థ రూ.70850 సహకారంతో ఇంటిని నిర్మాణం చేసి ఇవ్వడం అభినందనీయమన్నారు. అతని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.విష్ణు దనుస్సు కలలుగన్న సమాజం కోసం ఆశయ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మీటు వీ సంస్థ వ్యవస్థాపక సభ్యులు కిరణ్ మాట్లాడుతూ పేద కుటుంబం పరిస్థితిని చూసి మీటు వీ సంస్థ సభ్యులు ఆర్థికంగా తోడ్పడ్డారన్నారు. కొంతమంది మానవత్వంతో స్పందించి సంస్థకు సహకరించారన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షులు కల్లూరి మల్లేశం, వైస్‌ఎంపీపీ నాగటి ఉపేందర్,మీటువీ సంస్థ సభ్యులు యాదగిరి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,మునిపంపులసర్పంచ్ యాదాసు కవితయాదయ్య, సింగిల్ విండో డైరెక్టర్ కల్లూరి సైదమ్మ,శాఖ కార్యదర్శి జనపాల లక్ష్మణ్,వార్డు సభ్యులు బైకాని నర్మద,గట్టు నర్సింహ్మ, దండిగ నర్సింహ, పరమేశ్, పల్లె సత్యం ఆదర్శ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.