Authorization
Fri April 11, 2025 07:52:39 pm
- మంత్రి కొప్పులఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బుద్ధుడి బోధనలు నాటికీ నేటికి అనుసరణీయమేనని షెడ్యూల్డ్ కులాల అభివృ ద్ధి,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కాకినాడకు చెందిన ప్రముఖ బౌద్ధ భిక్షువు బంతే ధామ్నా ధజథేరో ప్రచురించిన పోస్టర్,నూతన సంవత్సర కేలండర్ను ఆదివారం హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహం వద్ద ఆయన అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్రావు,బౌద్ధ భిక్షువు ధజథేరో, సమతా సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు అహింస,శాంతి,దయ,కరుణ,ప్రేమ, సోదర భావం,సౌభ్రాతృత్వం,సమానత్వా న్ని బోధించా రని తెలిపారు.ఆయన భోదనలు కోట్లాది మందిని ప్రభావితం చేశాయన్నారు.అవి నాటికి ,నేటికి ,ఏనాటికి కూడా ఆచరణీయం,అనుసరణీ యమేనని తెలిపారు. ఆయన బోధనలతో భారత ఉపఖండం, జపాన్,చైనా, మంగోలియా, కాంబోడియా, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంక, థారు ల్యాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాల ప్రజలను బాగా ప్రభావితం చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. లౌకిక భావాలను ముందుకు తీసుకుపోతున్నదని చెప్పారు.