Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లాటమెబైల్ సంక్రాంతి ఆఫర్లను విరివిగా అందుకోవాలని సంస్థ డైరెక్టర్ అఖిల్.యం తెలిపారు. దక్షిణ భారత దేశంలో స్మార్ట్ మొబైల్ రిటైల్ రంగంలో దిగ్గజం లాట్ మొబైల్ని ఆయన పేర్కొన్నారు.గత తొమ్మిదేండ్లుగా తెలుగు రాష్ట్రాల్లో 150 స్టోర్లకు చేరువలో విజయవంతంగా ముందడుగు వేస్తున్నదని ఆయన తెలిపారు. స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ. 7,000వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందని పేర్కొన్నారు. పాత టీవీ తీసుకురండీ కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.3,500వరకు ఎక్సేంజ్ బోనస్ పొందవచ్చని తెలిపారు. హెచ్పీ రియల్మి ల్యాప్టాప్లు కోనుగోలుపై రూ.2,500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందనీ, సులభవాయిదాల పద్దతిలో కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్బీఐ కార్డుద్వారా మొబైల్ కొనుగోలుపై ఐదు శాతం వరకు ఇన్ట్సెంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుందని తెలిపారు. వివో మొబైల్ కొనుగోలుపై 10శాతం వరకు క్యాష్ బ్యాక్ లబిస్తుందని తెలిపారు. సాంమ్సంగ్, నోకియా, రియల్మి ట్యాబ్ల కొనుగోలుపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని పేర్కొన్నారు. వన్ప్లస్ కొనుగోలుపై రూ. ఆరువేలు వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందని తెలిపారు.