Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఐదు కోట్ల కరోనా డోసుల పంపిణీ పూర్తయినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆరోగ్య సిబ్బందీ అంకితభావం, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమయిందని పేర్కొన్నారు. ఐదు కోట్ల మార్కును దాటినందుకు ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని మంత్రి ప్రజలను కోరారు.