Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనా టెస్టులు తగ్గాయి
- పండుగల తర్వాత పెరిగే అవకాశం
- జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యనిపుణులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరీక్షలు భారీగా తగ్గాయి. అదే సమయంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తక్కువగా నమోదవుతున్నది. పాజిటివ్ రేటు మాత్రం అంతకు ముందు మాదిరిగానే వేగంగా పెరుగుతున్నది. పండుగ సెలవుల అనంతరం తిరిగి పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్యతోపాటు పాజిటివ్ కేసులు భారీగా వస్తాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తున్నది. కరోనా పరీక్షలు, కేసులతో నిమిత్తం లేకుండా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. జనవరి 12న రాష్ట్రంలో 90,021 టెస్టులు చేయగా 2,319 (2.17 శాతం) మందికి పాజిటివ్ వచ్చింది. మరుసటి రోజు 84,280 పరీక్షలు నిర్వహించగా 2,707 మందిలో (3.21 శాతం) వైరస్ బయటపడింది. జనవరి 14న సంక్రాంతి రోజు టెస్టులు మరింత తగ్గి 68,525కు పరిమితం కాగా 2,398 మందికి (3.49 శాతం) కోవిడ్-19 సోకినట్టు గుర్తించారు. శనివారంనాటికి టెస్టులు 53,073కు తగ్గగా కేసులు 1,963కు దిగాయి. అయితే పాజిటివ్ రేటు మాత్రం 3.69 శాతం రావడంగమనార్హం. అంటే పరీక్షలు తక్కువగాజరుగుతున్నా, పాజి టివ్ కేసులుతగ్గినట్టు కనిపిస్తున్నా పాజిటివ్ రేటు ఎక్కువగా రావడం కరోనా వ్యాప్తివేగం మాత్రం పెరుగుతూనే ఉన్నది. ఈనేపథ్యంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు మాస్కులుధరించటం, భౌతికదూరంపాటించటం, జనస మ్మర్ధం ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండటం, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
స్పీకర్‌కు మళ్లీ కరోనా : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి మళ్లీ కరోనా సోకింది. స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎటువంటి సమ స్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. గతఏడాది నవంబరు 26న శ్రీనివాస్‌రెడ్డికి కరోనా సోకింది. నవంబరులో పోచారం మనవరాలి వివాహం హైదరాబాద్‌లో జరి గింది. ఆసమయంలో ఆయనకు కరోనా సోకింది. పోచారం రెండు కరోనా టీకా డోసులు వేసుకున్నారు. అయినా ఆయన తిరిగి కరోనాబారిన పడ్డారు.
భట్టికి కరోనా : సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.ఇదిలా ఉండగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జనగాంఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి తాజాగా కరోనాబారిన పడ్డారు.