Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 కోట్ల ఆస్తినష్టం
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 అగ్నిమాపక యంత్రాల ద్వారా దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్లబ్లో అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్టు అంచనా వేశారు. కాగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం 1878లో క్లబ్‌ను నిర్మించారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. ఈ క్లబ్‌ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్ కూడా విడుదల చేశారు. ఈ క్లబ్లో దాదాపు 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. క్లబ్లో 5వేల మందికిపైగా సభ్యత్వం ఉంది.