Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు ప్రాంతాల్లో నీటమునిగిన పంటలు
- తడిసిన ధాన్యం బస్తాలు
- నూతనకల్‌లో కొట్టుకుపోయిన మిర్చి
నవతెలంగాణ-విలేకర్లు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని పిల్లలజగ్గుతండాలో గుగులోతు మున్యి పూరిండ్లు శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కూలిపోయింది. అదేవిధంగా కల్లంలో అరబెట్టిన 32 బస్తాల ధాన్యం తడిసి ముద్దైంది. ఈ సందర్భంగా లంబాడీ హక్కుల పోరాటసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుగులోతు చీనానాయక్ మాట్లాడుతూ మున్యికి ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతనకల్‌లో అకాలవర్షంతో మిర్చి రైతులకు నష్టం కలిగింది. మండలంలోని మాచినపల్లి గ్రామానికి చెందిన వీరబోయిన వెంకన్న 20 క్వింటాళ్ల మిర్చి కల్లంలో ఆరబెట్టగా వర్షానికి మిర్చి అంతా కొట్టుకుపోయింది. దీంతో రైతు రోదిస్తున్నారు. సూర్యాపేటలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు కలె క్టర్ వినరుకృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు పాటిల్హేమంత్కేశవ్, ఎస్. మోహన్‌రావులు వేర్వేరుగా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పలు ప్రాంతా లలో వరదనీరును తొలగించేందుకు ముమ్మర చర్యలనుచేపట్టారు. యస్. వి.ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కళాశాల వద్ద వరద నీరు ఉదృతి వలన అటువైపు ఎవ్వరు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. సద్దల చెరువు, పిల్లల మర్రిచెరువు నీరు కాలువల ద్వారా దిగువకు పంపించడంతో పాటు జేసీబీల ద్వారా కాలువలలో ఉన్న చెత్తను తొలగించి వరద ఉధృతిని నివా రించారు. అర్వపల్లి మండలకేంద్రంలో పలు ఇండ్లలోకి నీరు వచ్చిచేరింది.