Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 20న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా. నర్సింహాచార్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరిగే ఈ సమావేశంలో ఎస్సీల ప్రయోజనాల కోసం టీఎస్ఆర్టీసీ అమలు చేస్తున్న రిజర్వేషన్లు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు.