Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ జయంతి నుంచి రెండు నెలల పాటు పాదయాత్రలు : బీజేపీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు అంశాన్ని కేంద్ర నాయకత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని హోటల్ అబోడ్లో ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆ కమిటీ చైర్మెన్ ఏపీ జితేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు ఒంటేరు జైపాల్, సీహెచ్.విఠల్, కాంచన క్రిష్ణ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎస్సీమోర్చా ఇన్చార్జి డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, కోశాధికారి శాంతికుమార్, కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష తదితరులు పాల్గొన్నారు.