Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భార్యాభర్తలను విడదీయబోమని ప్లానింగ్‌బోర్డు వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో సోమవారం తెలంగాణ ఉద్యోగ సంఘం 2022 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ భార్యాభర్తలు వేరువేరుగా పని చేస్తే మానసిక ఒత్తిడికి గురైతారన్నారన్నారు. వారు సరిగా పని చేయటం సాధ్యం కాదన్నారు. ఇద్దరూ ఒకే చోట పనిచేసే విధంగా త్వరలో నిర్ణయం వస్తుందని చెప్పారు. ఉద్యమస్ఫూర్తితో పని చేస్తున్న టీఆర్ఎస్కు ఉద్యోగ సంఘం వెన్నుదన్నుగా ఉండాలని కోరారు. ఉద్యోగుల సంఘం చైర్మెన్ ఎ. పద్మాచారి మాట్లాడుతూ... తెలంగాణ పోరాటంలో ఉద్యోగుల సంఘం పోషించిన పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు. తెలంగాణ సాధన తర్వాత ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్య భూమిక పోషిస్తున్నదన్నారు. ఆర్టికల్ 371డి, రాష్ట్ర పతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ, తదితర అంశాలపై సంఘానికి స్పష్టత ఉందని చెప్పారు. జీవో 317, ఉద్యోగుల గ్రీవెన్స్ పైన వేసిన ఐఏఎస్ కమిటీలో తెలంగాణ ఉద్యోగుల సంఘాన్ని భాగస్వామ్యం చేయాలని కోరారు. సంఘం అధ్యక్షుడు మఠం రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎంప్లాయిస్ జోనల్, డిస్ట్రిక్ట్ క్యాడర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందన్నారు. 80 శాతం ఉద్యోగులు సంతోషంగానే వెళ్లిపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సలహాదారులు పి పనవ్ కుమార్ గౌడ్, అధ్యక్షులు మఠం రవీంద్ర కుమార్ ప్రధాన కార్యదర్శి హరిష్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.