Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్ - లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు సోమవారం ట్విట్ చేసింది. ఈ నెల 24, 26, 28, 31 తేదీల్లో నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ప్రత్యేక రైలు (07295) రాత్రి 8:10 గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8:15 గంటలకు లింగంపల్లి స్టేషన్కు చేరుకోనున్నదని పేర్కొంది. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, నల్లగొండ, సికింద్రాబాద్ మీదుగా లింగంపల్లికి చేరుకుంటుందని తెలియజేసింది. అలాగే ఈనెల 25, 27, 29, ఫిబ్రవరి ఒకటిన నాలుగు రైళ్లు లింగంపల్లి- కాకినాడ టౌన్ మార్గంలో నడుస్తాయనీ, సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 6:10 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.