Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న, ధాన్యం తడిసిపోయిన బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జంగారెడ్డి, టి.సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో మార్కెట్కు తీసుకెళ్లిన ధాన్యం, వాకిళ్ళల్లో అరబోసిన ధాన్యం వరదల్లో కొట్టుకుపోయిందని వాపోయారు. తామర పురుగు సోకడంతో మిర్చి పంట, గులాబీ తెగులుతో పత్తిపంట దెబ్బతిన్నాయని తెలిపారు. గతేడాది రాష్ట్రంలో12.60 లక్షల ఎకరా ల్లో పంటలు దెబ్బతినగా, ఈ ఏడాది వరదల వలన 8.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు.దీనికి తోడు 2022 జనవరిలో వచ్చిన అధిక వర్షాలు, రాళ్ళవానలతో రైతుల పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇంత జరిగినా రాష్ట్ర సర్కారు గణాంకాలు సేకరించలేదనీ, కనీసం కేంద్ర బృందాలను పిలిచి సర్వే కూడా చేయించలేదని విమర్శించారు.