Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు ట్రస్మా వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాలలను వెంటనే తెరవాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరాబాద్లో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. పాఠశాలలు తెరవకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలను ప్రారంభించాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్నాయనే కారణంతో ఈనెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగించడం సరైంది కాదని పేర్కొన్నారు. కరోనా వల్ల ఇప్పటికే విద్యాప్రమాణాలు దిగజారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల్లేకుండా విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించడం వల్ల వారిలో అక్షరజ్ఞానం లేకుండా పోతున్నదని తెలిపారు.