Authorization
Sat April 12, 2025 01:08:34 am
- పలు విశ్వవిద్యాలయాలు ప్రకటన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఈనెల 30వ తేదీ వరకు పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఈ మేరకు జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ జి లక్ష్మినారాయణ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల కొత్త షెడ్యూల్ కోసం తమ విశ్వవిద్యాలయాల వెబ్సైట్లను సంప్రదించాలని రిజిస్ట్రార్లు సూచించారు. మంగళవారం నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయని తెలిపారు.