Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీడీఎస్ సూపరింటెండెంట్‌కు వినతి
నవతెలంగాణ-కంఠేశ్వర్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు ఇచ్చినట్టుగానే అంగన్వాడీ కేంద్రాలకూ సెలవులు ఇవ్వాలని అంగన్ వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) నాయకులు కోరారు. ఐసీడీఎస్ నిజామా బాద్ జిల్లా ప్రాజెక్టు అధికారి సూపరింటెండెంట్‌కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేశ్‌బాబు మాట్లాడుతూ.. చిన్న పిల్లలు ఉండే అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.స్వర్ణ, నిజామాబాద్ ప్రాజెక్టు నాయకురాలు సరిత పాల్గొన్నారు.