Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హన్మకొండ
ఎన్పీడీసీఎల్ స్టోర్ హమాలీలను ఆర్టీజన్లుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.ప్రభాకర్‌రెడ్డి, రాగుల రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వరంగల్ పరిధిలోని 600మంది హమాలీలు హనుమకొండలోని సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెకు దిగారు. వారి సమ్మెకు మద్దతు తెలుపుతూ వారు మాట్లాడారు. కూలి రేట్లను పెంచమని అడిగితే తగ్గించడం అన్యాయమన్నారు. 40శాతం కూలి రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు, ఎన్పీడీసీఎల్ స్టోర్ హమాలీలను ఆర్టీజన్లుగా గుర్తించాలనీ, కనీసవేతనం రూ.21 వేలు చెల్లించాలని కోరారు. రెండు జతల యూనిఫామ్స్, గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కంపెనీ సీఎండీ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ నిరవధిక సమ్మెలో హమాలీ యూనియన్ నాయకులు నాగేశ్వర్రావు, విజయరాజు, జి. రాజు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.