Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్-2022) కన్వీనర్‌గా ప్రొఫెసర్ వి సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. పీఈసెట్ నిర్వహణ బాధ్యతను మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)కు అప్పగించారు. సత్యనారాయణ ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ డీన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల ఏడున ఎంసెట్ కన్వీనర్‌గా ఏ గోవర్ధన్ (జేఎన్టీయూ), ఈసెట్ కన్వీనర్‌గా ఎ విజయకుమార్‌రెడ్డి (జేఎన్టీయూ), ఐసెట్ కన్వీనర్‌గా కె రాజిరెడ్డి (కేయూ), పీజీఈసెట్ కన్వీనర్‌గా పి లక్ష్మినారాయణ (ఓయూ), ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఏ రామకృష్ణ (ఓయూ), లాసెట్ కన్వీనర్‌గా జిబి రెడ్డి (ఓయూ)ను నియమించిన విషయం తెలిసిందే.