Authorization
Sun April 13, 2025 11:16:51 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 2,447 మందికి కరోనా సోకింది. ముగ్గురు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 80,138 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 10,732 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,197 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1,112 మందికి కరోనా సోకింది. కాగా ఆదివారంతో పోలిస్తే సోమవారం 30 జిల్లాల్లో కేసులు పెరిగాయి. జీహెచ్ఎంసీతో మూడు తగ్గాయి. పాజిటివ్ రేటు 3.05 శాతంగా నమోదయింది.