Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్ వేముల వర్ధంతిలో టిి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉన్నత విద్యా సంస్థలలో మతోన్మాద శక్తులను ఐక్యంగా ప్రతిఘటించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. రోహిత్ వేముల లాగా వ్యవస్థీకృత హత్యలకు మరొకరు బలికాకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రోహిత్ వేముల ఆరో వర్థంతిని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలలో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా మతోన్మాదులు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మనువాదుల కాలంనాటి సాంఘీక బహిష్కరణలతో మానసిక వేధింపులు తాళలేక రోహిత్ వేముల బలయ్యారని పేర్కొన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో మత చాందసభావాలు పెట్రేగిపోయి భావి మేధావుల భావాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ వేముల చావులో కూడా కులాన్ని వెతకటం నీచపు చర్యలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకే బాధ్యులు జి. బుచ్చిరెడ్డి, సోషల్ మీడియా నెట్వర్క్ ఇంచార్జ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.