Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ ఎనర్జీ కోసం ప్రయత్నించాలన్న మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు మరింత పెరగాలనీ, గ్రీన్ ఎనర్జీ దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో ఫార్ములా-ఈ టీమ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేటీఆర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం సరికొత్త శకానికి నాందిగా అభివర్ణించారు. అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. సీతారాంపూర్,దివిటిపల్లిలో ఈవీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఫార్ములా వన్ రేసింగ్‌ను ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.రాబోయే రోజు ల్లో హైదరాబాద్ ఈ-రేస్‌కు హౌస్ట్‌గా నిలవనుందన్నారు. సెక్రటేరి యట్,తెలుగుతల్లి ఫ్లైఓవర్,హుస్సేన్‌సాగర్ చుట్టూ2.37 కిలోమీటర్ల ఈ-రేసింగ్ కోర్టు అందుబాటులోకి రానుందని వివరించారు.
కేటీఆర్‌కు ఆహ్వానం
జనవరి 28, 29 తేదీల్లో ఏబీబీ ఎఫ్ఐఎ ఫార్ములా ఇ దిరియా ఇ-ప్రిక్స్ (సౌదీ అరేబియా)లో పాల్గొనాలను ఫార్ములా-ఇ ఛీఫ్ ఛాంపియన్ షిప్ ఆఫీసర్ అల్బెర్టో లోంగో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు. ప్రారంభ ఛాంపియన్ షిప్ చైనాలోని బీజింగ్ లో 2014లో నిర్వహించిన సంగతి తెలిసిందే.