Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మొత్తం గ్రామాలను ఆదర్శగ్రామాలుగా కేంద్రం ప్రకటించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇది అరుదైన ఘనత అని అన్నారు.పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థలో రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందన్నారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలోనూ ఒకటోస్థానంలోనే ఉన్నామని గుర్తు చేశారు. పంచాయతీ భవనాలు, కాలువల పూడితీత వంటి పనులకు కూడా ఉపాధి నిధులను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతేగాక వచ్చే మార్చికల్లా వీలైనంత ఎక్కువగా ఉపాధి పనులు చేయాలని ఆదేశించారు. వెనుకబడిన పాలమూరు జిల్లా అభివద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను మరింతగా అభివద్ధి చేసే బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మెన్లు, జెడ్పీటీసీలు, సర్పంచులు తీసుకోవాలని మంత్రులు కోరారు. అలాగే ప్రజా ప్రతినిధులు సూచించిన పనులు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ పై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని అదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ పథకాల అమలు తీరుతెన్నులపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు కూచకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పీవీ వాణిదేవి, ఎమ్మెల్యేలు చర్లకోల లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మహేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, అలా వెంకటేశ్వరెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, క్రాంతికిరణ్ పాల్గొన్నారు. సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేల దష్టికి తేవాలనీ, ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో మండలాల వారీగా సమీక్షించి, అభివద్ధిని పరుగులు పెట్టించాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన గ్రామ పంచాయతీలు, ఎస్సీ రిజర్వు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై సీఎం ఆదేశానుసారం నడుచుకుంటామని అన్నారు. ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్వహణ వంటి విషయాల్లో అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొత్త రోడ్లు, మురుగునీటి కాలువల పనులు కూడా త్వరలోనే వస్తాయని చెప్పారు. ఈ సమీక్షలో మిషన్ భగీరధ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి, పీఆర్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవరావు తదితర అధికారులు పాల్గొన్నారు.