Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బి.బి.స్వెయిన్ హామినిచ్చారు. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండిస్టీ (ఎఫ్ టీసీసీఐ)ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంగళవారం వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వెయిన్ మాట్లాడుతూ ఇప్పటికే అమల్లో ఉన్న సీజీటీఎంఎస్ఈ పథకానికన్నా మెరుగైన పథకాన్ని తీసుకు రానున్నామని తెలిపారు. ఎంఎస్ఈల కోసం ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్న సలహా బాగుందంటూ స్వాగతించారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్రాలకు తగిన సూచనలు చేస్తామని తెలిపారు.
ఎఫ్టీసీసీఐ సీనియర్ ఉపాధ్యక్షులు అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ సులభతర వాణిజ్యంతో తెలంగాణ ఎక్కువ జీఎస్ డీపీతో దేశంలో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. ఎఫ్టీసీసీఐ ఇండిస్టియల్ డెవలప్ మెంట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్ గరిమెళ్ల మాట్లాడుతూ టర్మ్ లోన్లు, వర్కింగ్ క్యాపిటల్ తదిదరాలపై మారిటోరియాన్ని పొడిగించాలని కోరారు.