Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాజుల శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఇంగ్లీషు మాద్యమాన్ని బోధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్దెభవనాల్లో కొనసాగుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలకు స్వంత భవనాల నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలనీ, ప్రయివేటు విద్యాసంస్థల దోపిడిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.