Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చినజీయర్ స్వామి ఇటీవల చేసిన ప్రవచనాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కులాల నిర్మూలన తగదనీ, ఏ కులం వారు ఆ కులం పనేచేయాలని చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు. మాంసాహారులు ఏ జంతువు మాంసం తింటారో ఆ జంతువుల మాదిరిగానే వ్యవహరిస్తారనే మాటలు మధ్యయుగాలను గుర్తు చేస్తున్నదని విమర్శించారు. ఆయన వేదశాస్త్రాలతోపాటు భౌతిక రసాయన శాస్త్రాలు అధ్యయనం చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి మధ్యయుగాల నాటి అంధ విశ్వాసాల స్థాపనకు సన్నద్ధం కావడం అవివేకమని తెలిపారు. కోట్ల రూపాయలతో నిర్మించిన విగ్ర హానికి సంకుచిత భావాలతో సమానత్వ ప్రతిమ అని పేరు పెట్డం విడ్డూ రంగా ఉందని పేర్కొన్నారు. చినజీయర్ స్వామి ప్రవచనాలు బహుజనుల మనోభావాలను కించపర్చడమేనని విమర్శించారు. సమాజ పురోగతిని వ్యతిరేకించే ఇలాంటి వ్యక్తి తలపెట్టిన కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, సీఎం హాజరు కావడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని తెలిపారు.