Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 28వరకు స్వీకరణ:గిరిజన సంక్షేమ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమ మోడల్ పాఠశాలల్లో క్రీడా కోచ్‌లుగా పనిచేసేందుకు ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చందన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 సంవత్సరానికి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేయటానికి ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్‌లలో ఎన్ఎస్,ఎన్ఐఎస్ డిప్లొమా కోర్సు పూర్తిచేసినవారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను షషష.్ర్తీఱbaశ్రీషవశ్రీటaతీవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో తమ రెజ్యూమ్‌ను జతపర్చి రజూశీత్ీరశీటళషవత్ీషసఏస్త్రఎaఱశ్రీ.షశీఎ మెయిల్‌కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5గంటల వరకు పంపాలని కోరారు.