Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రికి టీఎస్‌జీసీసీఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పెంచాలని టీఎస్‌జీసీసీఎల్‌ఏ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్‌కు టీఎస్‌జీసీసీఎల్‌ఏ అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ మంగళవారం ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించారు. ఆలస్య రుసుం లేకుండా ఈనెల 24వ తేదీ వరకే ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగించిందని గుర్తు చేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలూ మూసివేయడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులు ఫీజు చెల్లించే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆలస్య రుసుం లేకుంండా ఫీజు చెల్లించే గడువును పెంచాలని కోరారు. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.